మహిషాసురమర్దనీ దేవిగా అమ్మవారు
PLD: మాచర్లలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం మహిషాసురమర్దిని దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుని, ఆలయ ప్రాంగణంలో జరిగిన సామూహిక కుంకుమ పూజలో పాల్గొన్నారు.