'సీఎం చేతుల మీదుగా ల్యాబ్ ప్రారంభించాం'
TPT: తిరుమల ల్యాబ్‌లో అత్యున్నత ప్రమాణాలు, అత్యాధునిక పరికరాలు ఉన్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. NABL గుర్తింపు రాగానే ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. గుంటూరు, విశాఖల్లోనూ ల్యాబ్‌లు ప్రారంభిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా లేబరేటరీలను ఆధునీకరించి నాణ్యమైన సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. ప్రజారోగ్యం విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు.