సుంకేసుల బ్యారేజీకి పెరుగుతున్న వరద

సుంకేసుల బ్యారేజీకి పెరుగుతున్న వరద

GDWL: కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలు, తుంగభద్ర డ్యాం నుంచి విడుదల చేసిన నీటితో రాజోలి సమీపంలోని సుంకేసుల బ్యారేజీలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. గురువారం ఉదయం బ్యారేజీలోకి 1,45,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు బ్యారేజీలోని 19 గేట్లను 2 మీటర్లు, 1 గేటును 1 మీటరు ఎత్తి 1,41,634 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.