ఎంఎస్ఎఫ్ నేతకు దళిత రత్న అవార్డు

ఎంఎస్ఎఫ్ నేతకు దళిత రత్న అవార్డు

MNCL: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సీసీసీ నస్పూర్ కు చెందిన మాదిగ స్టూడెంట్ ఫోరమ్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ కొండ్ర ఉదయ్ మాదిగకు దళిత రత్న అవార్డు ప్రధానం చేశారు. హైదారాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జయంతి ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్ రోజారాణి అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు.