పెట్రోల్, డీజిల్‌ను నివాస గృహాల్లో నిల్వ చేయవద్దు: ఎస్సై
JGL: పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే భయంతో కొందరు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి నివాస గృహాల్లో నిల్వ చేస్తున్నారని, పెట్రోల్, డీజిల్‌ను నివాస గృహాల్లో నిల్వ చేయవద్దని పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం పెట్రోల్, డీజిల్ కొరత లేదని, వాహనదారులు ఆందోళన చెందవద్దన్నారు. ఇళ్లల్లో ఇందనం నిల్వ చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.