బొరిగివలస పంచాయతీలో అస్తవ్యస్తంగా పారిశుధ్యం

SKLM: నరసన్నపేట మండలం బొరిగివలస పంచాయతీలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందంటూ స్థానిక గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం స్థానికులు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడంతో మురుగునీరు రహదారులపైకి పారుతుందని తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలంటూ వారు కోరుతున్నారు.