ఏటీఎంలో మృతదేహం కలకలం

ఏటీఎంలో మృతదేహం కలకలం

HYD: మాసబ్‌ట్యాంక్‌ వద్ద ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. విజయ్‌నగర్‌ కాలనీలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.