విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్సై

విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్సై

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్ సెంటర్లో సోమవారం తెల్లవారుజామున ఎస్సై మాధవరావు వాహనాల తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనాల్లో గంజాయి వంటి నిషేధిత మత్తుపదార్థాలు, మారణాయుధాలు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వాహనదారులను హెచ్చరించారు. అన్ని రకాల ధ్రువపత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని ఆయన సూచించారు.