అగ్ని ప్రమాదంలో వృద్ధురాలి సజీవ దహనం

VZM: గరివిడి మండలం కోనూరులో సోమవారం తెల్లవారుజామున విషాదం నెలకొంది. ఉదయం 5గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొని ఓ పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యింది. ఇంటిలో ఉన్న యడ్ల అసిరితల్లి(70) సజీవదహనమయ్యింది. ఘటన జరిగిన సమయంలో ఇంటిలో ఉన్న గ్యాస్ బండ పేలిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.