'నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కృషి ఎనలేనిది'
NRPT: మక్తల్‌లో ప్రజాపాలన విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం CM రేవంత్ రెడ్డి రూ.1,000 కోట్ల నిధులను మంజూరు చేశారని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండేళ్లలో రోడ్లు, ఆసుపత్రులు, నీటిపారుదల వంటి పలు పనులకు భారీగా నిధులు అందించినందుకు ప్రజలు CMకు కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి ప్రతిపక్షాలు విమర్శించడం బాధాకరమన్నారు.