నేడు ఈ ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం

శ్రీకాకుళం: సారవకోట విద్యుత్ సబ్ స్టేషన్లలో గల 11కేవీ అలుదు ఫీడర్‌లో మరమ్మతులు చేపట్టినుండడం వల్ల మంగళవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టెక్కలి ఈఈ జి.శంకర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో సారవకోట, గొర్రిబంధ, అలుదు, కుమ్మరిగుంట, అడ్డపనస, అర్లి, గుజ్జువాడా, అన్నుపురం తదితర గ్రామాలకు సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.