బాలిక అదృశ్యంపై కేసు నమోదు
E.G: రాజానగరం(మం) నరేంద్రపురంకి చెందిన ఉల్లి భవాని(17) అనే బాలిక అదృశ్యంపై రాజానగరం పోలీస్ స్టేషన్‌లో సోమవారం కేసు నమోదు అయింది. గ్రామానికి చెందిన ఆమె ఈనెల 8వ తేదీ రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి ఇంట్లో పడుకుంది. మరుసటి రోజు లేచేసరికి ఆమె కనిపించలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తండ్రి రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.