రోడ్డుపైనే నిద్ర.. వేతనాల కోసం ఆశాల పోరు
KNR: కనీస వేతనం రూ. 8,000 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆశా కార్యకర్తలు చేపట్టిన 48 గంటల దీక్ష రెండో రోజుకు చేరింది. దోమల కాటు, కటిక చీకటిని లెక్కచేయకుండా రాత్రంతా రోడ్డుపైనే నిద్రించి నిరసన తెలిపారు. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, బడ్జెట్‌లో న్యాయం చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.