SLBC టన్నెల్ పూర్తి చేసి తీరుతాం: రేవంత్

SLBC టన్నెల్ పూర్తి చేసి తీరుతాం: రేవంత్

TG: SLBC టన్నెల్‌ను పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని సీఎం రేవంత్ అన్నారు. 'టన్నెల్ పురోగతిని పరిశీలించాం. టన్నెల్ బోర్ మిషన్‌తో మిగతా పనులు చేయడం కష్టంగా మారింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. టన్నెల్ పనులు పూర్తి చేసి తీరుతాం. ప్రాజెక్టు 1983లో మంజూరైంది. కేసీఆర్ పదేళ్లలో మిగతా 10 కి.మీ. టన్నెల్ పూర్తి చేయలేదు' అంటూ విమర్శించారు.