రాజధాని రైతుల సమస్యలపై నేడు సమావేశం
AP: రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ ఇవాళ మరోసారి సమావేశం కానుంది. ఈ ఉదయం 10 గంటలకు CRDA ఆఫీస్‌లో జరిగే సమావేశంలో కమిటీ సభ్యులు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్‌తో పాటు సంబంధిత అధికారులు ఆయా సమస్యల పరిష్కారానికై చర్చలు జరపనున్నారు. కాగా ఈ కమిటీ ఇప్పటికే రెండు సార్లు భేటీ అయిన సంగతి తెలిసిందే.