VIDEO: హెల్త్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

వనపర్తి: హెల్త్ యాప్‌ను రోగులతో పాటు వైద్యులు సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టర్ వనపర్తి మండలం కడుకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నమోదైన మధుమేహం, క్షయ వ్యాధి గ్రస్తుల వివరాలు వనపర్తి హెల్త్ యాప్‌లో తనిఖీ చేశారు.