రోడ్డుకు అడ్డంగా ఉన్న పొదలు తొలగింపు
SRD: ఝరాసంగం మండలం బొప్పనపల్లి వెళ్లే రహదారిలో ఇవాళ గ్రామానికి చెందిన యువకులు ఇరు పక్కల పేరుకుపోయిన చెట్ల కొమ్మలు, ముళ్ళ పొదలు JCB ద్వారా తొలగించారు. వాహన రాకపోకలకు రోడ్డుకు అడ్డంగా కొమ్మలు చాలా ఇబ్బందిగా ఉండడంతో యువకులు స్పందించి స్వచ్ఛందంగా రోడ్డు క్లియర్ చేశారు. ఇందులో సంఘమేశ్వర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, డానియల్, సత్తార్, నాగన బసంతి ఉన్నారు.