VIDEO: రాజన్నకు తలనీలాలు సమర్పించుకుంటున్న భక్తులు

SRCL: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని కోరిన కోర్కెలు నెరవేరిన నేపథ్యంలో తమ పిల్లపాపలందరూ తలనీలాలు సమర్పించుకుంటున్నారు. స్వామి వారికి కోడె మొక్కులతో పాటు తలనీలాలు సమర్పించడం ద్వారా కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా, పేదల పెన్నిధిగా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామికి గొప్ప పేరుంది.