తిరుమలనంబి అవతార మహోత్సవాలు

TPT: తిరుమల దక్షిణ మాడ వీధిలోని శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఈనెల 30, 31 శ్రీ తిరుమలనంబి 1052వ అవతార మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. 16 మంది ప్రముఖ పండితులు శ్రీ తిరుమలనంబి జీవిత చరిత్రపై ఉపన్యసించనున్నారు. శ్రీవారి భక్తాగ్రేసరుడైన శ్రీ తిరుమలనంబి స్వామివారికి తీర్థకైంకర్యం ప్రారంభించారు. అదే నేటి ఆకాశగంగ తీర్థం స్వామివారి అభిషేకానికి వినియోగిస్తున్నారు.