కోడిపందాల స్థావరాలపై పోలీసులు దాడులు

NLR: కోవూరు మండలంలోని పోతిరెడ్డి పాలెం గ్రామ పరిధిలో పెన్నా నదిలో ఆదివారం కోడిపందాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో కోడిపందాల స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఇందులో భాగంగా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రంగనాథ్ గౌడ్ తెలిపారు. 8 బైకులు, ఒక ఆటో, మూడు కోడి పుంజులు, 1500 నగదును సీజ్ చేశారు.