గనిలో కాల్పులు.. 70 మంది మృతి
దక్షిణ సూడాన్‌లో దారుణం జరిగింది. బంగారం గని వద్ద తవ్వకాల విషయంలో కంపెనీలు, మైనర్ల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదం కాస్త కాల్పులకు దారి తీసింది. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో 70 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకోవడంతో అక్కడి వారు పారిపోయారు. అనంతరం మృతదేహాలను అధికారులు ఆసుపత్రికి తరలించారు.