ప్రతి సోమవారం ప్యాపిలిలో PGRS కార్యక్రమం

ప్రతి సోమవారం ప్యాపిలిలో PGRS కార్యక్రమం

NDL: ప్యాపిలి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రతి సోమవారం జరగనుందని ఎమ్మార్వో భారతి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపుతామని అన్నారు. పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయి అధికారులకు పంపిస్తామన్నారు. ప్రజలు సమస్యలు తెలపడానికి 1902 కాల్ సెంటర్ లేదా గ్రామ సచివాలయంలో కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.