22వ వార్డులో ముమ్మరంగా పారిశుధ్య పనులు
NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ 22వ వార్డులో బుధవారం పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టారు. ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రధాన డ్రైనేజీలను శుభ్రం చేయిస్తున్నట్లు కౌన్సిలర్ రాజేష్ కుమార్ తెలిపారు. మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్‌తో కలిసి ఆయన పనులను పర్యవేక్షించారు. వార్డులో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని కౌన్సిలర్ స్పష్టం చేశారు.