విజయ్, డీఎంకే మధ్య ఫ్లెక్సీల యుద్ధం

విజయ్, డీఎంకే మధ్య ఫ్లెక్సీల యుద్ధం

తమిళనాడులో డీఎంకే, నటుడు విజయ్ మధ్య ఫ్లెక్సీల యుద్ధం మొదలైంది. మదురైలో విజయ్‌కు వ్యతిరేకంగా డీఎంకే పోస్టర్లు వెలిశాయి. సీఎం స్టాలిన్‌ను విజయ్ 'అంకుల్' అని సంబోధించాడన్న వార్తలపై ఈ పోస్టర్ల ద్వారా డీఎంకే కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ 'రాజకీయ ప్రత్యర్థి'గా డీఎంకేను పేర్కొనడం కూడా ఈ వివాదానికి కారణమై ఉండవచ్చని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.