నష్ట పరిహారం చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

నష్ట పరిహారం చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

గద్వాల మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారంగా ఆర్థిక సహాయం అందించారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో 11 మంది బాధితులకు చెక్కులు అందజేశారు. మొత్తం 25 మంది లబ్ధిదారులకు కలిపి రూ.1,36,13,756 నష్టపరిహారం మంజూరైనట్లు ఆయన తెలిపారు.