VIDEO: పెట్రోల్ పోసుకొని మహిళ ఆత్మహత్యాయత్నం
KNR: రామడుగు(M) వెదిర శివారులో గల మద్యం దుకాణం సమీపంలో మంగళవారం కరీంనగర్‌కు చెందిన కాసిన గొట్టు భారతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తనపై పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకోగా, గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై తన సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకొని, తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.