విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్
WGL: "ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక-99"లో భాగంగా TGSWRS పర్వతగిరి పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా బాలల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆన్‌లైన్ గేమ్స్, అపరిచితుల పట్ల జాగ్రత్తలు పాటించాల్సిందిగా సూచించారు.