డీసీఎం, ఆటో ఢీ.. పలువురికి గాయాలు
MDK: హవేలిఘన్‌పూర్ మండలం శమనాపూర్ శివారులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామాయంపేట నుంచి మెదక్ వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న డీసీఎం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ బోయిని రమేష్ పరిస్థితి విషమంగా ఉండగా, ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.