ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
KRNL: పెద్దకడబూరులో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో TDP నేత రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి, ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన సేవలను కొనియాడారు. ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ సేవలో ప్రతి ఒక్కరు పని చేయాల్సిందేనని, ఆయనను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.