కొండారెడ్డి పల్లి చెరువును సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

NRPT: నారాయణపేట సమీపంలోని కొండారెడ్డిపల్లి చెరువును బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి బుధవారం సందర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో చెరువును అత్యంత అందంగా తీర్చిదిద్ది వినాయక, బతుకమ్మ నిమజ్జనం చేసేందుకు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.