VIDEO: అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే

VIDEO: అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే

వరంగల్ కలెక్టరేట్‌‌లో ఎంపీ పోరిక బలరాం నాయక్ ఆధ్వర్యంలో ఇవాళ జరిగిన దిశా కమిటీ సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలో రహదారులు, కల్వర్టులు, గ్రామీణ అభివృద్ధి పనులను నిర్దిష్ట కాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.