నేడు జిల్లాలో జాబ్ మేళా
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 6 యూనిట్లలో 250 ఉద్యోగాల భర్తీ కోసం ఇవాళ ఉదయం 10:30 నుంచి మ. 2:00 వరకు జిల్లాలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కార్యాలయం అధికారి ప్రకటించారు. SSC, ఇంటర్, డిగ్రీ, ITI అర్హతలున్న 18–30 ఏళ్ల అభ్యర్థులు తమ సర్టిఫికేట్లతో హాజరు కావాలని కోరారు. ఎంపికైన వారికి రూ.12,000 నుంచి రూ.30,000 వరకు జీతం ఇవ్వనున్నారు.