క్రికెట్ బెట్టింగ్ వేస్తున్నారా.. జాగ్రత్త..!
ASR: IPL వేళ క్రికెట్ బెట్టింగ్ దారులకు జిల్లా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. 'బెట్టింగ్ ఒక క్లిక్‌తో మొదలై.. జీవితాన్ని కష్టాల్లోకి నెడుతుంది. సులభంగా డబ్బు సంపాదిస్తానని ఆశపడకండి. అది మోసం, నష్టం, నేరాలకు దారి తీస్తుంది. బెట్టింగ్ వల్ల కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, చట్టపరమైన సమస్యలు వస్తాయి. జాగ్రత్తగా ఉండండి.. బాధ్యతగా జీవించండి' అంటూ సూచించారు.