నిజమైన పేదలకే ఇళ్లు కేటాయించాలి: పొంగులేటి

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. నిజమైన పేదలకే ఇళ్లు కేటాయించాలని పేర్కొన్నారు. తప్పు జరిగిందని చెబితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టోల్ ఫ్రీ నంబర్ ఇస్తామని, దానికి ఫోన్ చేసి వివరాలు చెప్పాలని సూచించారు. గృహనిర్మాణ శాఖకు మంచిపేరు తేవాలని ఇంజినీర్లను కోరుతున్నట్లు చెప్పారు.