సైబర్ నేరాలపట్ల మహిళలకు అవగాహన సదస్సు నిర్వహణ

SKLM: నారీ శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని ASI పోగిరి శంకర్రావు తెలిపారు. శనివారం ఉదయం నరసన్నపేట మండలం పెద్ద బొరిగివలస పంచాయతీలో స్థానిక గ్రామస్తులకు మహిళలకు సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై అవగాహన పరిచారు. సెల్ ఫోన్లు వాడే వారు తెలియని నెంబర్ నుంచి వచ్చిన వాటిని తెరవద్దని తెలియజేశారు.