నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
PPM: జియ్యమ్మవలస విద్యుత్ ఉప కేంద్ర పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం ఆదివారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ శంకరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రావాడ రామభద్రపురం ఫీడర్ పరిధిలో సరఫరా నిలిపివేస్తామన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.