హెడ్ పోస్ట్ ఆఫీస్‌లో ఆధార్ సేవల పునరుద్ధరణ

హెడ్ పోస్ట్ ఆఫీస్‌లో ఆధార్ సేవల పునరుద్ధరణ

NLG: నల్లగొండలోని హెడ్ పోస్టాఫీస్‌లో ఆధార్ సేవలను పునరుద్ధరించినట్లు తపాలా శాఖ నల్గొండ డివిజన్ సూపరింటెండెంట్ కె. రఘునాథస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఈ పోస్టాఫీస్‌లో ఆధార్ సేవలు అందించామని, సాంకేతిక కారణాల వల్ల నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.