దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ

దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ

PLD: దివ్యాంగుల పట్ల అందరూ ఉదారత చూపాలని కలెక్టర్ కృత్తికా శుక్లా కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆమె 13 మందికి ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. జిందాల్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో వీటిని అందించారు. దివ్యాంగుల సమస్యల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామన్నారు. ప్రతి నెలా నాలుగో శనివారం ఈ కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు.