సోదర భావాన్ని చాటిన ఇఫ్తార్ విందు
NLG: చిట్యాల మండలం ఎలికట్టెలో రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు హిందూ ముస్లింల మధ్య సోదరభావాన్ని చాటింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు గుడిపాటి లక్ష్మీనర్సింహ పాల్గొన్నారు. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ అని, కఠిన ఉపవాస దీక్షలు గొప్పవని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ సాగర్ యాదమ్మ, ఉప సర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.