బిర్యానీలో బల్లి.. కస్టమర్ షాక్

HYD: నగర శివారు ఇబ్రహీంపట్నం మెహిఫిల్ హోటల్ బిర్యానీలో ఏకంగా బల్లి వచ్చిందని కస్టమర్ కృష్ణారెడ్డి తెలిపారు. సగం బిర్యానీ తిన్నాక దాన్ని చూసి కంగుతిన్నానని.. సిబ్బందిని ప్రశ్నిస్తే బాగా ఉడికింది కదా అని సమాధానం చెప్పారని ఆయన వాపోయారు. దీనిపై స్థానిక PS ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నట్లు వాపోయాడు.