బీహార్‌లో రేపే తొలిదశ ఎన్నికలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రేపు తొలిదశ ఎన్నికలు జరగనున్నాయి. మొదటిదశలో 121 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనుండగా.. 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారి భవిష్యత్తును 3.75 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. కాగా, 243 అసెంబ్లీ సీట్లు ఉన్నా బీహార్‌లో రేపు 121 స్థానాల్లో.. మిగిలిన స్థానాల్లో రెండో దశ ఎన్నికలు 11న జరగనున్నాయి. 14న లెక్కింపు జరగనుంది.