ఆర్డీవోను అడ్డుకున్న మహిళలు
SKLM: ఎయిర్‌పోర్ట్ వద్దంటే గ్రామాలలో సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారంటూ పలాస RDOవెంకటేష్‌తో పాటు రెవెన్యూ సిబ్బందిని రైతులు, మహిళలు ప్రశ్నించారు. సర్వే సమీక్షించేందుకు ఆర్డీవో వెంకటేష్ మందస మండల ఉద్దాన ప్రాంతమైన బిడిమి, రాంపురం గ్రామాలకు సోమవారం వెళ్లారు. దీంతో రైతులు, మహిళలు ఆర్డీవో వాహనంను చుట్టిముట్టి అడ్డగించారు. అసహనంతో ఆర్డీవో, సర్వే టీం వెనుదిరిగారు.