'ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి'

MDK: ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థిగా బోధనలో పెరుగుతున్న శాస్త్ర సాంకేతికను విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఎంఈఓ శంకర్ పేర్కొన్నారు. మంగళవారం మెదక్ టీఎన్జీవో భవన్‌లో మండల స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల స్థాయిలో ఎంపిక చేసిన 30 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.