వన్డేలకు సీనియర్ బౌలర్ వీడ్కోలు

వన్డేలకు సీనియర్ బౌలర్ వీడ్కోలు

న్యూజిలాండ్ సీనియర్ బౌలర్ లీ తహుహు వన్డేలకు వీడ్కోలు పలికింది. వన్డేల్లో దేశానికి 100+ సార్లు ప్రాతినిధ్యం వహిస్తానని ఎప్పుడూ ఊహించలేదని, ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోడానికి ఇది సమయమని ఆమె పేర్కొంది. అయితే ఈ ఏడాది జూన్-జూలైలో వరల్డ్ కప్ టైటిల్‌ను డిఫెండ్ చేసేందుకు లీ T20ల్లో కొనసాగనుంది. ఇక 15 ఏళ్ల కెరీర్‌లో లీ 103 వన్డేల్లో 125, 98* T20ల్లో 95 వికెట్లు తీసింది.