సన్న బియ్యంపై తప్పుడు ప్రచారం చేస్తే..FIR నమోదు

NLG: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీపై తప్పుడు ప్రచారం చేస్తే FIR నమోదు చేస్తామని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ హెచ్చరించారు. ఇటీవల గోదావరిఖనికి చెందిన ఒక వ్యక్తి రేషన్ షాప్‌లో సన్నబియ్యానికి బదులుగా ప్లాస్టిక్ బియ్యం సరఫరా చేస్తున్నారని పేర్కొంటూ సోషల్ మీడియాలో తప్పుడు వీడియో, అతనిపై FIR నమోదయిందన్నారు.