మాతృత్వం చాటుకున్న కానిస్టేబుల్

మాతృత్వం చాటుకున్న కానిస్టేబుల్

MHBD: కురవి మండల కేంద్రంలో ఇవాళ మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓటు వేయడానికి ఓ మహిళ ఓటరు చంటి పాపను ఎత్తుకొని రాగా.. పోలింగ్ స్టేషన్ వద్ద విధులు నిర్వహిస్తున్న కురవి పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ అనిత ఆ పాపని ఎత్తుకొని మాతృత్వం చాటుకుంది. ఈ సంఘటనను చూసిన పలువురు మహిళా కానిస్టేబుల్ అనితను అభినందిస్తున్నారు.