సెన్సార్ బోర్డుకు 'మోగ్లీ' చిత్ర నిర్మాణ సంస్థ సారీ
'మోగ్లీ' చిత్ర నిర్మాణ సంస్థ 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' సెన్సార్ బోర్డుకు క్షమాపణలు చెప్పింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో నటుడు బండి సరోజ్.. 'నా నటన చూసి సెన్సార్ బోర్డు అధికారి భయపడిపోయాడు' అని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో, సెన్సార్ బోర్డు పట్ల తమకు గౌరవం ఉందని, ఆ నటుడు ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని పేర్కొంటూ నిర్మాణ సంస్థ క్షమాపణలు కోరింది.