దోమల నివారణపై అవగాహన కల్పించిన వైద్య సిబ్బంది

దోమల నివారణపై అవగాహన కల్పించిన వైద్య సిబ్బంది

CTR: డెంగ్యూ, మలేరియా మొదలగు జ్వరాలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఫ్రైడే డ్రైడే పాటించాలని అర్బన్ PHC డాక్టర్ కిరణ్మయి సూచించారు. శుక్రవారం పుంగనూరు పట్టణం కొత్తపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో వైద్య సిబ్బంది ప్రజలు దగ్గరకు వెళ్లి దోమలు పుట్టకుండా, కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.