శాంతి కస్టడీపై ముగిసిన వాదనలు
కృష్ణ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దేవాదాయ శాఖ ఏసీ శాంతి రెండో విడత కస్టడీపై వాదనలు ముగిశాయి. రెండు రోజుల కస్టడీలో సహకరించలేదనీ, ఇంకా పలు విషయాలు రాబట్టాల్సి ఉందని, మరో విడత కస్టడీకి ఇవ్వాలని ఇటీవల అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది. ఇరు పక్షాల వాదనలు పూర్తయ్యాయి.