ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్
NZB: జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్‌లు సోమవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిబంధనలకు అనుగుణంగా ఈవీఎం గోడౌన్ సీల్‌ను తెరిపించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్‌లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు.